వేతన జీవులకు ఊరట..ఐటీ 5 లక్షలకు పెంపు

316
budget
- Advertisement -

ఎన్నికల ముందు వరాల జల్లు ప్రకటించింది కేంద్రం. సామాన్య ప్రజలు,వేతన జీవులు,రైతులే లక్ష్యంగా జనాకర్షక బడ్జెట్‌ని ప్రవేశ పెట్టింది. ఆదాయపు పన్ను పరిమితి రూ.5లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5లక్షల వరకూ ఉన్న వారికి బీమా, పెన్షన్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

వచ్చే ఐదేళ్లలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌. రవాణా వాహనాల్లో భారత్‌ జోరు. ఎలక్ట్రానిక్‌ వాహన వినియోగం పెరిగింది. 2030కల్లా ఈ రంగంలో భారత్‌దే సింహ భాగం అని తెలిపారు. ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై తర్వలో నిర్ణయం తీసుకుంటాం. మంత్రి వర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి తుది నిర్ణయం అని చెప్పారు.

భారతీయ సినిమాల నిర్మాణం అనుమతి కోసం సింగిల్‌ విండో విధానం తీసుకురానున్నాం. జీఎస్‌టీ విధానంతో ఉత్పత్తిదారులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరింది. ఎక్కువ వస్తువులు 0-0శాతం శ్లాబుల్లోనే ఉన్నాయని చెప్పారు.

- Advertisement -