రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోడీ..

205
Modi to open DGPs meet in city on November 25
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రేపు రాష్ట్రానికి రానున్నారు మోడీ.
దేశ అంతర్గత భద్రత అంశంపై సర్దార్ వల్లాభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీపీల సదస్సులో మోడీ పాల్గొననున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ సహాయ మంత్రులు కిరణ్‌రిజిజు, హన్‌‌సరాజ్ అహిర్ గంగారాం, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ధోవల్, రా, ఐబీ సంస్థల చీఫ్‌ల బృందంతో కలసి శుక్రవారం సాయంత్రం 6.35 గంట లకు ప్రత్యేక విమానంలో రాజీవ్‌గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరు కోనున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికా రులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు.

ప్రధాని మోడీ బృందం నేరుగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషల్ పోలీసు అకాడమీకి చేరుకుని అక్కడి రాజస్థాన్ భవన్‌లో రాత్రి బస చేయ నుంది. అకాడమీలో శనివారం ఉదయం ప్రారంభం కానున్న రాష్ట్రాల డీజీపీ, ఐజీపీల సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేయనున్నారు. శనివారం సాయంత్రం 5.35 గంటలకు ప్రధాని మోదీ, అజిత్ ధోవల్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కాను న్నారు. ఉగ్రవాదం నుంచి సైబర్ నేరాల వరకు ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగ నుందని ఎన్‌పీఏ వర్గాలు తెలిపాయి.

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పోలీ సులను భారీగా మొహరించారు. ఇప్పటికే కేంద్ర బలగాలు నేషనల్ పోలీస్ అకాడమీ ని ఆధీనంలోకి తీసుకుని అణువణువు పరి శీలించాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మరోవైపు సీఎస్‌ రాజీవ్‌శర్మ కూడా ఉన్నతాధికారులతో సమీక్షించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీని ఆదేశించారు.

- Advertisement -