ఆమ్ ఆద్మీ పార్టీకి కళ్ళెం వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా ? మోడీ టార్గెట్ కేజ్రీవాల్ యేనా ? బీజేపీ వేసిన ఉచ్చులో ఆప్ ఉక్కిరి బిక్కిరి అవుతోందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగేందుకు వడివడిగా అడుగులేస్తోంది. ఆ మద్య జరిగిన గుజరాత్ ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో జాతీయ పార్టీ హోదా కూడా దక్కించుకుంది. ఇక దేశ వ్యాప్తంగా పార్టీ ని విస్తరించేందుకు ఆప్ అధిష్టానం కృషి చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా డిల్లీ లిక్కర్ స్కామ్ ఆప్ నేతలను చుట్టుముట్టింది. వరుస ఈడీ రైడ్ లు, ఆరోపణలతో ఆప్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఇటీవల ఆ పార్టీ కి చెందిన ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా తో పాటు మరో అప్ నేత సత్యేంద్ర జైన్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. .
మరికొంత మంది నేతలు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆప్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. అయితే కేంద్ర ప్రభుత్వం ఆప్ ను టార్గెట్ చేయడానికి కారణం.. ఆ పార్టీ జాతీయ పార్టీగా విస్తరిస్తుండడమే అని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. పంజాబ్ లో బిజెపి కి షాక్ ఇస్తూ ఆప్ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక గుజరాత్ ఎన్నికల్లో కూడా బిజెపి ఓటు బ్యాంక్ ను ఆప్ గట్టిగానే చిల్చింది. అలాగే మద్యప్రదేశ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి షాక్ ఇచ్చింది. అడుగడుగున బీజేపీకి చెక్ పడుతూ ఆప్ విస్తరిస్తుండడం.. కమలం పార్టీకి ఆందోళన కలిగించే విషయం. అంతే కాకుండా మోడి టార్గెట్ గా అరవింద్ కేజ్రీవాల్ చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.
దీంతో ఆప్ దూకుడుకు చెక్ పెట్టేందుకు మోడీ సర్కార్ పక్కా ప్రణాళికతోనే డిల్లీ లిక్కర్ స్కామ్ ను బయటకు తీసి ఈడీ అస్త్రాన్ని ప్రయోగించింది అనేది కొందరి అభిప్రాయం. ఇదిలా ఉంచితే తాజాగా మనిష్ సిసోడియా కేజ్రీవాల్ కు రాసిన రాజీనామా లేఖ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజాయితీతో పని చేసే వారిని అవినీతి ఆరోపణల్లో ఇరికించడం దురదృష్టకరం అని సిసోడియా లేఖలో పేర్కొన్నారు. ఇదంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న నిజాయితీ రాజకీయాలకు బయపడి కొందరు చేస్తున్న కుట్ర అంటూ, నిజానికి వాళ్ళ టార్గెట్ నేను కాదు మీరే ( కేజ్రీవాల్ ) అంటూ లేఖలో రాసుకొచ్చారు మనిష్ సిసోడియా. దీంతో లిక్కర్ స్కామ్ ఉచ్చులో కేజృవాల్ కూడా చిక్కుకొనున్నారా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అదే గనుక జరిగితే నేషనల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి…