తిమ్మాపూర్ వెంకన్నకు రూ.7కోట్లు..

18
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ బాన్సువాడలోని తిమ్మాపూర్‌లోని వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…వేంకటేశ్వరస్వామి గుడి బాగు కోసం రూ.7కోట్ల నిధులు కేటాయిన్నట్టు ప్రకటించారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాదిరిగా ఉండేదని కానీ ప్రస్తుతం ఈ గ్రామం చుట్టూ పొలాలు, నీటితో నిండుకుండలా కనిపిస్తున్న చెరువులు ఆహ్లాదకరంగా మారిందన్నారు.

ఆలయం కోసం ఎంత చేసిన తక్కువేనని…గుడి అభివృద్ధి కోసం రూ.23కోట్లు ఖర్చు చేసినట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారని…దానికి అదనంగా మరో రూ.7కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. గుడి అభివృద్ధి కోసం మరింత నిధులను మంజూరు చేస్తామని అన్నారు. ఒక్క బాన్సువాడ ఏరియాలోనే రైతులు రూ.1500కోట్ల పంట పండిస్తున్నారని స్థానికుల ద్వారా తెలిసిందని సీఎం చెప్పారు.

బాన్సువాడ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని అయిన సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ కింద మరో రూ.50కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవంలో పాల్గొనే అవకాశం అందరికీ రాదని…తనకు తన ధర్మపత్నితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతమన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన శ్రీనివాస్‌రెడ్డికి ఆయన ధర్మపత్నికి ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి…

తిమ్మాపూర్ బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్

కొవ్వూరు…టీటీడీ చతుర్వేద హవనం

మొక్కలు నాటిన డిప్యూటీ మేయర్…

- Advertisement -