మోడీ టార్గెట్.. కే‌సి‌ఆర్ కుటుంబమే!

59
modi
- Advertisement -

తెలంగాణలో సుపరిపాలన పాలన అందిస్తున్న కే‌సి‌ఆర్ కుటుంబాన్ని మోడీ టార్గెట్ చేస్తున్నారా ? దేశ రాజకీయాల్లో మోడీకి సరైన ప్రత్యర్థిగా కే‌సి‌ఆర్ ను భావిస్తున్నారా ? అందుకే మోడీ సర్కార్ కే‌సి‌ఆర్ ను ఇంతలా టార్గెట్ చేస్తుందా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ గా మోడీ సర్కార్ పన్నుతున్న వ్యూహాలు చేస్తుంటే పై ప్రశ్నలు తలెత్తక మానవు. దేశంలో ప్రస్తుతం మోడీకి ధీటైనా ప్రత్యర్థి కొరత ఉందనేది అందరు ఒప్పుకోవాల్సిన సత్యం. కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ ఉన్నప్పటికి స్థిరత్వం లేని నిర్ణయాల వల్ల రాహుల్ ను ధీటైన ప్రత్యర్థిగా భావించడం లేదు కాషాయ పార్టీ. ఇక నితీశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్ఝి, కేజృవాల్ వంటి దేశ నాయకులు మోడీని ఢీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికి మోడీకి ఉన్న ఇమేజ్ కారణంగా వాళ్ళంతా కూడా చతికిల పడుతున్నారు.

ఇలాంటి సమయంలో బి‌ఆర్‌ఎస్ తో కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కే‌సి‌ఆర్ నేషనల్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టడంతో అందరి చూపు కే‌సి‌ఆర్ పై పడింది. ప్రస్తుతం తెలంగాణను అన్నీ రంగాల్లో కూడా అగ్రస్థానంలో నిలబెట్టిన కే‌సి‌ఆర్.. ఒకవేళ ప్రధాని పదవి చేపడితే.. దేశం మరింత అభివృద్ది పథంలో నడుస్తుందని దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల కీలక నేతలు బి‌ఆర్‌ఎస్ పార్టీకి కే‌సి‌ఆర్ కు గట్టిగానే మద్దతు తెలుపుతున్నారు. దేశ ప్రజల్లో కూడా కే‌సి‌ఆర్ పై సానుకూల భావం ఉండడంతో కమలం పార్టీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్ వల్ల మోడీకి గట్టి దేబ్బే అని భావించిన బిజెపి సర్కార్.. కే‌సి‌ఆర్ ను అనిచే ప్రయత్నం చేస్తోంది.

ఆ మద్య తెలంగాణలో కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని కుల్చేందుకు ఎమ్మెల్యేలకు ఏరా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సి‌ఎం కే‌సి‌ఆర్ కూతురు కవితాను అక్రమంగా లిక్కర్ స్కామ్ లో ఇరికెంచే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కార్. ఇదంతా కూడా కే‌సి‌ఆర్ ను వెనక్కిలాగే ప్రయత్నమని యావత్ దేశ ప్రజానీకానికి బాగా తెలుసు. ఇదే విషయాన్ని ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ కూడా చెప్పుకొచ్చారు. ” కే‌సి‌ఆర్ కుటుంబాన్ని మోడీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగానే టార్గెట్ చేస్తోందని, ఆయన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్నా పరినమలన్నీ చూస్తే దేశ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న బి‌ఆర్‌ఎస్ ను నిలువరిచడానికి బీజేపీ వేస్తున్న వ్యూహాలు అనే సంగతి స్పష్టంగా అర్థమౌతుంది.

ఇవి కూడా చదవండి…

సర్వేలన్నీ అనుకూలం..విజయం తథ్యం…

బండి సంజయ్‌కు నిరసన సెగ..

నూతన సచివాలయం ముహుర్తం ఖరారు..

- Advertisement -