వచ్చే ఐదేండ్లలో ఐదుగురు ప్రధానులు…ఇదే విపక్ష కూటమి స్కెచ్ అని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారత్‌ను ముక్కలుగా చూడాలనుకునే వారు ప్రధాని పదవిని కూడా పంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో మంగళవారం జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన మోడీ..2014కు ముందు ప్రతిరోజూ బాంబు పేలుడు ఘటనల గురించి వార్తాపత్రికల్లో హెడ్‌లైన్స్ వచ్చేవని ఇప్పుడు అలాంటి వార్తలకు చోటు లేకపోవడంతో పాటు భారత్ తన సరిహద్దులను కూడా దీటుగా కాపాడుకుంటోందని పేర్కొన్నారు.
వాయిదాల పద్ధతిలో ప్రధానులను అందించేవారు భారీ లక్ష్యాలను సాధించగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏటా ఓ ప్రధానిని వంతులవారీగా ఎన్నుకోవాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించిందని..ఐదేండ్లలో ఐదుగురు ప్రధానులను మార్చాలనే వారి ఆలోచనకు అర్ధం దేశాన్ని వంతులవారీగా లూటీ చేసేందుకేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:Pushpa2:పుష్ప-2…లిరికల్