Modi:క్యాన్సర్ కంటే వారు ప్రమాదకరం

15
- Advertisement -

ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరం అని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యూపీలోని స్ర‌వ‌స్ధిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మోడీ..విప‌క్ష ఇండియా కూట‌మికి మ‌త‌త‌త్వం, తీవ్ర జాతి వివ‌క్ష‌, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయ‌ని, క్యాన్స‌ర్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ వ్యాధులు వ్యాప్తి చెందితే దేశ‌మంత‌టా వ్యాప్తి చెంది నాశ‌నం చేస్తాయ‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌జ‌ల కోసం 60 ఏండ్లుగా ఏమీ చేయ‌ని వారు మోడీని నిలువ‌రించేందుకు ఏక‌మ‌య్యార‌ని ఎద్దేవా చేశారు. మోదీ దేశ‌వ్యాప్తంగా 4 కోట్ల మంది పేద‌ల‌కు ఇండ్లు ఇచ్చార‌ని, ఇప్పుడు ఎస్పీ-కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే అన్నింటినీ తారుమారు చేస్తార‌ని అన్నారు. మోడీ ప్ర‌తి గామానికి విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పిస్తే విప‌క్షాలు విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను క‌ట్ చేసి మ‌ళ్లీ చీక‌టిలో ముంచుతాయ‌ని అన్నారు.తాను ప్ర‌తి ఇంటికీ నీరందిస్తే ఎస్పీ-కాంగ్రెస్ నేత‌లు మీ ఇంటి పంపుల నుంచి నీటిని వీరు తీసుకెళ్లే ఘ‌నుల‌ని మోదీ ఆరోపించారు.

Also Read:KTR:చేసింది చెప్పుకోలేకే ఓటమి?

- Advertisement -