ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- పవన్ మధ్య సరదా సంభాషణ జరిగింది.
పవన్ కల్యాణ్ ఆహర్యాన్ని చూసి మోదీ.. మీరు హిమాలయాలకు వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. దానికి పవన్ ‘‘నేను ఎక్కడికి వెళ్లట్లేదు.. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హిమాలయాలకు వెళ్లడానికి ఇంకా సమయం ఉంది’’అని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్‌కల్యాణ్ మీడియాకు వెల్లడించారు.
హిమాలయాలకు వెళ్తున్నారా? పవన్‌తో మోదీ
దిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమం ఇవాళ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. పవన్ కల్యాణ్ ఆహర్యాన్ని చూసి మోదీ.. మీరు హిమాలయాలకు వెళ్తున్నారా? అని… pic.twitter.com/bQansn8Wzx
— ChotaNews App (@ChotaNewsApp) February 20, 2025
Also Read:గుండెపోటుకు సంకేతాలివే..జాగ్రత్త పడండి!