ప్రపంచంలోనే మూడో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 25 కోట్ల మంది పేదలను దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధాని అన్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మోడీ….ఆపరేషన్ సిందూర్‌తో ఇండియా ఆర్మీ సామర్థ్యం ప్రపంచదేశాలకు తెలియజేసిందన్నారు. కేవలం 22 నిమిషాల్లో శ్రతు స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని అన్నారు.
భారత్ దేశంలో పలు కీలక రంగాల్లో అనేక ఉన్నతిని సాధించిందని, మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తుండటం శుభ పరిణామమని అన్నారు. పార్టీలకు అతీతంగా దేశ హితం కోసం పలు రాష్ట్రాల ప్రతినిధులు పలు దేశాల్లో పర్యటించి పాక్ ఉగ్రవాదంపై విస్తృతంగా ప్రచారం చేశారని పేర్కొన్నారు.
Also Read:ఫీల్ గుడ్‌మూవీ..’కొత్తపల్లిలో ఒకప్పుడు’
భారత సైనిక పాటవాలను శుభాంశు శుక్లా రూపంలో ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయని కొనియాడారు. ఉగ్రవాదం , నక్సలిజం దేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నాయని …నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలిస్తున్నామని తెలిపారు. గతంలో రెడ్ కారిడార్లు గా చెప్పుకున్న ప్రాంతాలు గ్రీన్ గ్రోత్ జోన్లలోకి వస్తున్నాయని తెలిపారు.

