TTD:టీటీడీ మరో కీలక నిర్ణయం

6
- Advertisement -

టీటీడీ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను పెంచింది. ప్రస్తుతం రోజులో 10 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్న టీటీడీ.. వాటిని 100కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

గతంలో ప్రవాసాంధ్రులకు రోజులో 50 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేవారు. దానిని వైసీపీ సర్కార్‌ 10కి తగ్గించగా తాజాగా ప్రవాసాంధ్రులకు ప్రతీరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకోసం ప్రవాసాంధ్రులు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్‌సైట్ https://www.apnrts.ap.gov.in లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉచితం. ప్రవాసాంధ్రులు ఉంటున్న దేశాల వీసాలు, వర్క్ పర్మిట్ ల వివరాలు నమోదు చేయాలి.

Also Read:ఫీల్ గుడ్‌మూవీ..’కొత్తపల్లిలో ఒకప్పుడు’

వెబ్‌సైట్‌లో శ్రీవారి దర్శనానికి సంబంధించి మూడు నెలల స్లాట్లు కన్పిస్తాయి. అందులో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆరోజు పరిస్థితులను బట్టి టీటీడీ టికెట్లను కేటాయిస్తుంది. టికెట్లు కేటాయింపు అయిన వారికి తిరుమలలోని ఏపీఎన్ఆర్టీఎస్ కు చెందిన పీఆర్వో ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.

- Advertisement -