బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమంతో పేద వైద్య విద్యార్థికి ఆర్ధిక సాయం అందించారు. ‘గిఫ్ట్ ఎ స్మైల్’ స్పూర్తితో ఆర్ధిక సాయం చేయడానికి ముందుకొచ్చారు డాక్టర్ దంపతులు.
ఈ సందర్భంగా వారిని అభినందించారు కేటీఆర్. తమకు ఆర్థిక సాయం అందించిన డాక్టర్ దంపతులతో పాటు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు వైద్య విద్యార్థి సుస్మిత తల్లిదండ్రులు.
Also Read:తొలిసారి సినిమా ప్రమోట్ చేస్తున్నా:పవన్
జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, వెంకటాపూర్ కు చెందిన పేద వైద్య విద్యార్థి సుస్మిత విద్య కోసం, ఆర్ధిక సాయం చేయాలని ట్విట్టర్ (X)వేదికగా కేటీఆర్ గారిని ఆశ్రయించగా.. స్పందించిన కేటీఆర్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ పిలుపునిచ్చిన “గిఫ్ట్ ఎ స్మైల్” స్పూర్తితో ముందుకొచ్చారు డాక్టర్ దంపతులు డా. చంద్రశేఖర్ – డా. ప్రణయ వాణి ఆర్ధిక సాయం చేశారు. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు వైద్య విద్యార్థి సుస్మిత.. ఈ సందర్భంగా వైద్య దంపతులను కేటీఆర్ అభినందించారు.

