Modi:విద్యావ్యవస్థను ఆధునీకరిస్తున్నాం

11
- Advertisement -

దేశంలో విద్యావ్యవస్థను ఆధునీకరిస్తున్నామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వధ్వనీ ఫౌండేషన్‌, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ బాంబే, అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్ల మధ్య MOU కుదిరింది. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ..దేశ భవిష్యత్‌ కోసం యువతను సిద్ధం చేయడంలో విద్యావ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

2013-14 సంవత్సరంలో పరిశోధన అభివృద్ధి రంగానికి కేటాయించిన స్థూల వ్యయం 60వేలకోట్లు మాత్రమే అని తెలిపిన మోదీ, దాన్ని తాము లక్షా 25వేల కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.వాధ్వానీ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ కూడా ప్రారంభించాం. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో కలిసి పరిశోధనను ముందుకు తీసుకెళ్లడానికి మేము సంకల్పించాం. ఇది సాకారం కావడానికి కృషి చేసిన వాధ్వానీ ఫౌండేషన్, ఐఐటీ, ఇతర భాగస్వాములను నేను అభినందిస్తున్నాను అన్నారు.

భారతదేశ ద్వారా ఏఐ మిషన్ ద్వారా, అధిక-నాణ్యత కలిగిన డేటా సెట్‌లు, పరిశోధన సౌకర్యాలతో కూడిన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మితమవుతాయి. ఎక్సెలెన్స్​ కూడా మెరుగుపడుతుంది. భారత్​లోని ఏఐని అతి ఉత్తమంగా మార్చాలని మేము కృషి చేస్తున్నాము అని చెప్పారు.

Also Read:అలా అయితే పాకిస్తాన్‌కే వెళ్లండి:పవన్

- Advertisement -