వైట్ హౌజ్‌లో మోడీ…

210
modi
- Advertisement -

అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్ హౌజ్‌లో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా వారిద్దరూ జోకులేసుకున్నారు.

ఇండియాలో అయిదుగురు బైడెన్లు ఉన్నారంటూ జో బైడెన్ చేసిన కామెంట్‌కు ప్ర‌ధాని మోదీ స్పందిస్తూ.. వారికి సంబంధించిన డాక్యుమెంట్ల‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య చిర‌న‌వ్వులు పూశాయి.

1972లో 28 ఏళ్ల వ‌య‌సులో తాను తొలిసారి సేనేట‌ర్‌గా ఎన్నిక‌య్యాన‌ని, ఆ స‌మ‌యంలో ప్ర‌మాణ స్వీకారానికి ముందు త‌న‌కు ముంబై నుంచి ఓ లెట‌ర్ వ‌చ్చింద‌ని, బైడెన్ పేరుతో ఆ లేఖ ఉంద‌ని, ఆ వ్య‌క్తి ఈస్ట్ ఇండియా కంపెనీలో ప‌నిచేసిన‌ట్లు ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని జో బైడెన్ అన్నారు.

భార‌త్‌లో త‌మ పూర్వీకులు ఉన్నార‌న్న అంశంపై గ‌తంలోనూ ఓ సారి జో బైడెన్ గుర్తు చేశారు. ముంబైలో దూర‌పు బంధువులు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 2013లో అమెరికా ఉపాధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ముంబై విజిట్ చేశారు. త‌మ బంధువుల గురించి ఆరా తీయాలంటూ ఆ స‌మ‌యంలో ఆయ‌న అన్నారు.

- Advertisement -