మెట్రో రైలును ప్రారంభించిన మోడీ…

208
Modi launches Hyd Metro
- Advertisement -

గ్రేటర్ ప్రజల కలల రైలు పట్టాలెక్కింది. అత్యుత్తమ టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేస్తూ ఏర్పాటైన హైదరాబాద్ మెట్రో రైలు లాంఛనంగా ప్రారంభమైంది. మియాపూర్‌లో   పైలాన్‌ను ఆవిష్కరించిన మోడీ…మెట్రోను జాతికి అంకితం చేశారు. మెట్రో జర్నీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘టి–సవారీ’ మొబైల్‌ యాప్‌,బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. మియాపూర్  నుంచి కూకట్ పల్లి వరకు, తిరిగి కూకట్ పల్లి నుంచి మియాపూర్  వరకు మెట్రోలో ప్రయాణం చేశారు మోడీ.

ఇప్పటివరకు ట్రయల్ రన్‌కే పరిమితమైన మెట్రో రేపటి నుంచి  ప్రజలకు అందుబాటులోకి రానుంది. మియాపూర్ నుంచి అమీర్ పేట్, నాగోల్ నుంచి అమీర్ పేట్ వరకు సర్వీసులు నడపనున్నారు.  ఈ రూట్ లో ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీస్ ఉంటుంది.

Modi launches Hyd Metro

 మియాపూర్ నుంచి అమీర్ పేట్ కు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. 13కిలోమీటర్లలో 10 స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్ లో 30సెకన్లు మాత్రమే రైలు ఆగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై ప్రయాణం వాహనదారులు, ప్రజలకు నరకప్రాయంగా ఉంది. మెట్రో రైలు రాకతో ప్రజల కష్టాలు తీరనున్నాయి. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సులు, టాక్సీలు, ఆటోలు, ఆఖరికి సైకిళ్లపై ఆధారపడకుండా తక్కువ సమయంలో మెట్రోలో గమ్యాన్ని చేరుకోవచ్చు.

ప్రయాణికులను చివరి గమ్యస్థానం వరకు చేర్చడమే లక్ష్యంగా మెట్రో స్టేషన్స్ నుంచి ఫీడర్ బస్సులను  టీఎస్‌ఆర్టీసీ నడపనుంది. ఎంపిక చేసిన మెట్రో స్టేషన్ల నుంచి నివాస కాలనీలు, ఐటీ కారిడార్లను కలుపుతూ మొత్తం 50 బస్సులను  నడపనుంది.

ప్రస్తుతం ఒక కారిడార్ మాత్రమే అందుబాటులోకి వచ్చినప్పటికీ.. డిసెంబర్ 2018 నాటికి మొత్తం మూడు కారిడార్లలో రైళ్లను నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  మొత్తం 24 స్టేషన్ల మధ్య ఉన్న అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ ఓ ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పుకోవాలి. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెట్రో స్టేషన్ దేశంలోనే అతిపెద్దది.

దేశ రాజధాని ఢిల్లీలో 2002లో మొదటి దశ మెట్రో అందుబాటులోకి వచ్చాక.. పెద్ద నగరాల్లో మెట్రో ఆలోచనలకు బీజం పడింది. హైదరాబాద్‌లోనూ 2003నుంచి చర్చ మొదలైంది. 2007 నాటికి కార్యాచరణ సిద్ధమైంది. ఢిల్లీ మెట్రో రైలు సంస్థకు సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) బాధ్యతను అప్పగించారు. వీరు అధ్యయనం చేసి 3 కారిడార్లలో 72 కి.మీ. మార్గాన్ని ప్రతిపాదించారు. మొదట టెండర్లు దక్కించుకున్న మైటాస్‌ సంస్థకు సత్యం కుంభకోణం కారణంగా రద్దు చేశారు. 2010లో ఎల్‌అండ్‌టీ సంస్థ మెట్రో ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని చేపట్టారు. 2012 ఏప్రిల్‌లో పనులు మొదలెట్టారు. 2017 నవంబరు నాటికి 30 కి.మీ. మార్గాన్ని సిద్ధం చేశారు.

- Advertisement -