- Advertisement -
కరోనా కట్టడిలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ..ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు 130 కోట్ల మంది భారతీయులు దీపాలు వెలిగించాలని తద్వారా కరోనాను తరిమికొట్టాలనే సంకేతాన్ని ఇవ్వాలన్నారు.
కరోనాతో నెలకొన్న అంధకారాన్ని పారద్రోలి…మేం ఒంటరిగా లేమన్న సందేశాన్ని వినిపించాలన్నారు. జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారని చెప్పారు. లాక్ డౌన్ ప్రకటించి 9 రోజులు అయింది ప్రజలంతా స్వచ్ఛందంగా పాటిస్తున్నారని తెలిపారు.
సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉల్లంఘించకూడదన్నారు. కరోనా సైకిల్‌ను బ్రేక్ చేసేందుకు ఇదొక్కటే మార్గమని ప్రధాని తెలిపారు. 5వ తేదీన ఒంటరిగా కూర్చుని మహాభారతాన్ని గుర్తు చేసుకోండన్నారు. 130 కోట్ల ప్రజల సంకల్పాన్ని ఆలోచించాలన్నారు.
- Advertisement -