మోడీ.. కర్నాటక పీఎం ?

53
- Advertisement -

బీజేపీ పక్షపాత రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఒక రకంగాను, అధికారంలోని రాష్ట్రాలలో ఇంకోరకంగాను పాలన సాగిస్తూ ఉంటుంది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్. బీజేపీ నార్త్ లో ఉన్నంతా బలంగా సౌత్ రాష్ట్రాలలో లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఒక్క కర్నాటక మినహా మిగిలిన సౌత్ రాష్ట్రాలలో అసలు బీజేపీ ఉనికే ప్రశ్నార్థకంగా ఉంది. అందువల్ల మోడీ సర్కార్ ను నార్త్ రాష్ట్రాలపై ఉన్న ప్రేమ సౌత్ రాష్ట్రాలపై ఉండదనే విమర్శ తరచూ వినిపిస్తూనే ఉంటుంది. .

నిధుల విషయంలోనూ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంలోనూ నార్త్ రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది మోడీ సర్కార్. ఇక తాజాగా కర్నాటక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంపై బీజేపీ వరాల జల్లు కురిపిస్తోంది. పైగా ఆ రాష్ట్రంలో అధికారంలో కూడా ఉండడంతో అధికారం నిలుపుకునేందుకు లెక్కకు మించి హామీలు ప్రకటిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ఇప్పుడు సౌత్ రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉచిత వంట గ్యాస్ ఇస్తామని ఇలా రకరకాల హామీలను ప్రకటించింది బీజేపీ.

Also Read: పవార్ రాజీనామా.. బీజేపీ వ్యూహమేనా ?

అయితే ఒకవైపు మిగిలిన రాష్ట్రాలలో వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడిపై పెనుభారం వేసిన కేంద్ర బీజేపీ.. కర్నాటకలో మాత్రం ఉచిత వంట గ్యాస్ ఇస్తామని ప్రకటించడంతో ఏపీ తెలంగాణ ప్రజలు.. బీజేపీ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీజేపీ పక్షపాత దొరణీ ఇదే నిదర్శనమంటూ మండి పడుతున్నారు ప్రజలు. తాజాగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కే‌టి‌ఆర్ కూడా కర్నాటకలో బీజేపీ మేనిఫెస్టో పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కర్నాటకలో ఉచిత సిలిండర్లు ఇస్తామని చెబుతున్నా మోడీ సర్కార్.. తెలంగాణలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మోడీ కర్నాటకకు మాత్రమే ప్రధాన మంత్రా ? లేక దేశానికి ప్రధానమంత్రా ? తెలంగాణపై ఇంతా కక్ష పూరిత దొరణీ ఎందుకని ద్వజమెత్తారు కే‌టి‌ఆర్. మొత్తానికి బీజేపీ పాలిత రాష్ట్రాలపై మోడీకి ఉన్న ప్రేమ.. ఇతర రాష్ట్రాలపై లేదనే విషయం ఈ మేనిఫెస్టో తో మరోసారి రుజువైందనే చెప్పాలి.

Also Read: కాంగ్రెస్ మేనిఫెస్టో.. బీజేపీకి షాక్ !

- Advertisement -