లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆస్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశ ప్రజలకు మోడీ చేసిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. రాత్రికి రాత్రే నోట్ల రద్దు చేశారని దాని వల్ల ఏం ప్రయోజనం జరిగిందని ప్రశ్నించారు. నోట్లరద్దుతో ఉంతో మంది ఉపాధి కొల్పోయారని చిన్న మధ్య తరగతి పరిశ్రమలు దివాళ తీశాయని ఆరోపించారు. అంతేగాదు దేశ ప్రజల నెత్తిన జీఎన్టీ రుద్ది మరింత సంక్షోభంలో పడేశారని తెలిపారు.
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్టీని వ్యతిరేకించిన మోడీ…ప్రధానిగా అదేపనిని ఎందుకు చేశారని ప్రశ్నించారు.దేశానికి ప్రధానమంత్రిగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పారని కానీ అమిత్ షా కుమారుడు అవినీతికి పాల్పడినప్పుడు ఈ సేవకుడు ఏమయ్యారని సూటి ప్రశ్నించారు.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగంతో ఏపీ ప్రజల బాధ,ఆవేదన అర్థమైందన్నారు. రాజకీయ ఆయుధానికి ఏపీ ప్రజలు బాధితులుగా మారారని తెలిపారు.
ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోవాలని సలహాలు ఇస్తున్నారని…పెట్రోల్,డీజీల్‌ను జీఎస్టీలో చేర్చాలని కోరినా పట్టించుకోలేదన్నారు. రాఫెల్ ఒప్పందంలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు రాహుల్. తాను స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడుని కలిసి ఈ ఒప్పందం గురించి అడిగానని ..ఇలాంటి ఒప్పందమేమీ భారత్‌తో చేసుకోలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తనతో చెప్పారని రాహుల్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు వినగానే ప్రధాని మోడీ నవ్వాపుకోలేకపోయారు.