ప్రభాస్ లాంటి అల్లుడు కావాలిః అనుష్క త‌ల్లి

309
prabhas, anushka

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, హీరోయిన్ అనుష్క‌ల కాంబినేష‌న్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి. వీరిద్ద‌రూ చాలా స‌న్నిహితంగా ఉంటార‌ని మ‌న‌కు తెలిసిందే. లేడీ ఒరియెంటెడ్ చిత్రాల‌తో టాలీవుడ్ లో మంచి పేరుతెచ్చుకుంది అనుష్క‌. టాప్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. భాగ‌మ‌తి సినిమా త‌ర్వాత అనుష్క ఇంత‌వ‌ర‌కూ ఏసినిమాలో న‌టించ‌డం లేదు. త‌న త‌ర్వాతి సినిమా ఏంటనేది కూడా ఇంత‌వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌లేదు.

prabhas, anushka

అనుష్క, ప్ర‌భాస్ లు ఇద్ద‌రూ చాలా మంచి మిత్రుల‌నే విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు వివాహం చేసుకుంటార‌నే వార్త‌లు గ‌తంలో వ‌చ్చాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో బిల్లా, మిర్చి, బాహుబ‌లి సినిమాలు వ‌చ్చాయి. వీరిద్ద‌రి పెళ్లిపై గతంలో ప్ర‌భాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా స్పందించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా అనుష్క, ప్ర‌భాస్ లపై వ‌స్తున్న రూమ‌ర్ల‌పై అనుష్క త‌ల్లి స్పందించింది.

anushka-prabhas

ప్ర‌భాస్ అనుష్క‌లు చాలా మంచి స్నేహితుల‌ని..వారిద్ద‌రూ చాలా స‌న్నిహితంగా ఉంటార‌ని చెప్పారు. వారిద్ద‌రూ పెళ్లి చేస‌కుంటార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. ప్ర‌భాస్ లాంటి మిస్ట‌ర్ ఫ‌ర్ ఫెక్ట్ మాకు అల్లుడుగా వ‌స్తాడు కానీ ప్ర‌భాస్ కాదు అని తేల్చిచెప్పింది. వారిద్ద‌రు క‌లిసి ఎక్కువ సినిమాలు చేయ‌డం వ‌ల్ల వారిపై రూమ‌ర్లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌న్నారు. ఇప్ప‌టికైనా వాళ్ల‌పై త‌ప్పుడు ప్ర‌చారం ఆపేయాల‌ని చెప్పారు.