ఆస్తుల అమ్మకం అనగానే ఈ దేశంలో ప్రజలకు టక్కున గుర్తొచ్చే పేరు మోడీ సర్కార్. ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తుల అమ్మకానికి బిడ్‌ని ఆహ్వానించింది. తెలంగాణ, ఏపీ సహా మరో మూడు రాష్ట్రాల్లో ఆస్తుల వేలానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన 13 ఆస్తులను కేంద్రం వేలానికి పెట్టింది. వీటికి డిసెంబర్ 5 నుంచి బిడ్డింగ్‌లను అహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్ పోర్టల్ ఎంస్‌టిసితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఆస్తుల విలువ రూ.20,160 కోట్లుగా ఉంటుందని అంచనా.
వాస్తవానికి బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ సంస్థలకు రూ. 69 వేల కోట్ల ఆర్ధిక మద్దతిస్తామని ప్రకటించిన మోడీ సర్కార్ తాజాగా ఆ సంస్థల ఆస్తులను అమ్మకానికి పెట్టడం విడ్డూరమే.
ఇవి కూడా చదవండి..