మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న మోదీ…!

35
modi

దేన్నైనా అమ్మడంలో గుజరాతీ మార్వాడీల తర్వాత ఎవరైనా అని మన గుజరాతీ ప్రధాని మోదీ సార్ నిరూపిస్తున్నారు. మోదీగారు చెప్పేదొకటి..చేసేదొకటి అని దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నల్లధనం వెనక్కి తీసుకువచ్చి పేదల ఖాతాల్లో రూ. 15 వేలు వేస్తానని చెప్పిన మోదీ సార్ అధికారంలో రాగానే పెద్దనోట్లను రద్దు చేసి పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మరింత ఛిద్రం చేశారు. నోట్ల రద్దుతో సామాన్యులు బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర రోజుల తరబడి క్యూలో నిలబడి చనిపోయిన ఘటనలు ఉన్నాయి కాని… వేల కోట్ల కొత్త నోట్లు ఈజీగా బడాబాబులకు చేరిపోయాయి..అదీ ఘనత వహించిన మోదీగారి పాలన .సబ్ కా సాత్..సబ్ కా వికాస్ నినాదాన్ని తన గుజరాతీలైన అదానీ కా సాత్..అంబానీల కా వికాస్‌గా మార్చేశారు.

ఇక అసలు విషయానికి వద్దాం. పాలకులకు ఆస్తులు అంటే ఒకటి ప్రభుత్వ భూములు…రెండోది ప్రభుత్వ రంగ సంస్థలు. డెవలప్‌మెంట్ పేరుతో ప్రభుత్వ భూములను తెగనమ్మి ఆదాయం సమకూర్చుకోవడం ఒక మార్గం అయితే.. ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టుపెట్టి తన వంధిమాగధులైన వ్యాపార దిగ్గజాలకు లబ్ది చేకూర్చి… ఫలితంగా అంతకు మించి ఆర్థిక ప్రయోజనాలను పొందడం..పాలకులు చేసే పని..ఇందులో మన గుజరాతీ ప్రధాని మోదీ సార్ రెండాకులు ఎక్కువే చదివేసారు. ఇప్పటికే 1.76 లక్షల మంది పని చేసే ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్‌ఎల్ మూసివేత వెనుక…తన జాన్ జిగ్రీ దోస్త్ ముఖేష్ అంబానీకి చెందిన జియోకు లబ్ది చేకూర్చడమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక 42 కోట్ల పాలసీ దారులనూ, 31లక్షలకోట్ల ఆస్తులనూ కలిగి ఉన్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీలో కొంత భాగం ప్రైవేటీకరణ చేసేందుకు మోదీ సార్ రంగం సిద్ధం చేస్తున్నారు.

పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 2 లక్షల 10 వేల కోట్లను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని…. ఎల్‌ఐసీలో 25 శాతం వాటాలను అమ్ముకోవడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. మొత్తం10 లక్షల కోట్లకు ఎల్‌ఐసీ విలువను అమ్ముకోవాలని మోదీ సార్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక రీసెంట్‌గా ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ సర్కారు కుట్రలు చేస్తోంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, ఎల్‌ఐసీ, రైల్వేలను దశల వారీగా అంబానీలు, అదానీలకు అమ్మకానికి పెట్టేసిన మోడీ సర్కార్ మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతోందితాజాగా ఓరియంటల్ ఇన్సూరెన్స్.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలను సైతం ప్రైవేటీకరణ చేసేందుకు మోదీ సార్ స్కెచ్ వేస్తున్నారని సమాచారం. ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థలకు తాకట్టు పెడుతూ…తోటి గుజరాతీ వ్యాపారులైన అంబానీలు, అదానీలకు ప్రయోజనాలు కలిగిస్తూ…మన నమో మోడీ కాస్తా నయా మార్వాడీగా మారిపోయారని సెటైర్లు పడుతున్నాయి. గుజరాతీలైన మోదీ, అమిత్‌షాలు…మరో ఇద్దరు గుజరాతీలైన అంబానీలు, అదానీలకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ అన్నట్లు…హమ్‌దో..హమారో దో..అంటే మేమిద్దం..మావాళ్లిద్దరి ప్రభుత్వం అన్నట్లుగా మారిపోయింది..మోదీ సార్ తీరు ఇలాగే ఉంటే…త్వరలో దేశవ్యాప్తంగా బీజేపీ విముక్త భారత్‌ నినాదం ఊపందుకున్నా ఆశ్చర్యం లేదు.