మ్యాక్స్‌వెల్ ధరపై వార్నర్ షాక్..!

38
warner

ఐపీఎల్ 2021 ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ఇటీవలె వేలం ముగియగా ఐపీఎల్ వేదికలపై బీసీసీఐ కూడా ఓ క్లారిటీకి వచ్చింది. ఇక వేలంలో పంజాబ్‌ వదులుకున్న మాక్స్‌వెల్‌ను బెంగళూరు రూ.14.25 కోట్లకు సొంతం చేసుకుంది.దీనిపై స్పందించారు వార్నర్. ఓ ఫ్రాంఛైజీ వదులుకున్న మాక్స్‌వెల్‌ను మరో ఫ్రాంఛైజీ భారీ ధరకు దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌ వేలంలో మాక్స్‌వెల్‌కు భారీ ధర పలకడం చెడ్డ విషయమేమీ కాదు..కానీ అతడికి ఇంత భారీ ధర పలకడం ఆశ్చర్యంగా ఉందన్నాడు. 2020 ఐపీఎల్‌లో మాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు. పంజాబ్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన అతడు 15 సగటుతో 108 పరుగులే చేశాడు.