ఇటలీ ప్రధానికి మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్!

6
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చిన ‘మెలోడీ’ టాఫీల ప్యాకెట్‌తో ఉన్న ఒక వీడియోను ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని.రోమ్‌లో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇటలీ కౌంటర్‌పార్ట్ జార్జియా మెలోనికి ఒక ప్రత్యేకమైన “మెలోడీ” బహుమతిని అందించారు. ఇది ఇద్దరు నేతల మధ్య ఉన్న స్నేహపూర్వక బంధానికి మరొక ఆహ్లాదకరమైన క్షణాన్ని జోడించింది.

ఇటలీ ప్రధాని ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ, ‘మెలోడీ టాఫీలు’ బహుమతిగా ఇచ్చినందుకు పిఎం మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆ వీడియోకు ఆమె “బహుమతికి ధన్యవాదాలు అని క్యాప్షన్ ఇచ్చారు.

ఆ 12 సెకన్ల వీడియోలో, ఇద్దరు నాయకులు ఒక మెలోడీ టాఫీ ప్యాకెట్‌ను పట్టుకుని కనిపించారు. మెలోని మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ ఒక చక్కని బహుమతిని తెచ్చారు, ఇది చాలా చాలా మంచి టాఫీ — మెలోడీ అని అనగానే, ఇద్దరు నేతలు ఒక్కసారిగా నవ్వేశారు.

Also Read:ఇంద్రరామ్.. ‘డోంట్ స్లీప్’

- Advertisement -