ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ లో అమెరికా కనీసం 42 విమానాలను కోల్పోయింది. వీటిలో యుద్ధ విమానాలు (ఫైటర్ జెట్లు) మరియు డ్రోన్లు ఉన్నాయి. కొనసాగుతున్న సైనిక చర్యలు మరియు నష్టానికి గల ఖచ్చితమైన కారణాలను అంచనా వేయడంలో ఉన్న సవాళ్ల వల్ల ధ్వంసమైన విమానాల సంఖ్యను ఇంకా సవరించే అవకాశం ఉందని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) నివేదిక పేర్కొంది.
నష్టపోయిన లేదా దెబ్బతిన్నట్లు విమానాల వివరాల ప్రకారం.. F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్లు: 4,F-35A లైట్నింగ్ II: 1,A-10 థండర్‌బోల్ట్ II: 1,
KC-135 స్ట్రాటోట్యాంకర్ (ఇంధనం నింపే విమానాలు): 7,E-3 సెంట్రీ (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానం): 1,MC-130J కమాండో II విమానాలు: 2,HH-60W జాలీ గ్రీన్ II హెలికాప్టర్: 1,MQ-9 రీపర్ డ్రోన్లు: 24,MQ-4C ట్రైటాన్: 1 ఉన్నాయి.
అమెరికా కాంగ్రెస్ మరియు దాని కమిటీలకు విధానపరమైన, చట్టపరమైన విశ్లేషణలను అందించే సీఆర్‌ఎస్ (CRS).. మీడియా నివేదికలతో పాటు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ (పెంటగాన్) మరియు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) జారీ చేసిన ప్రకటనలను పరిశీలించి ఈ నష్టాల జాబితాను రూపొందించింది.
మే 12న జరిగిన హౌస్ అప్రాప్రియేషన్స్ సబ్ కమిటీ విచారణలో, యాక్టింగ్ పెంటగాన్ కాంప్ట్రోలర్ జూల్స్ డబ్ల్యూ. హర్స్ట్ III సాక్ష్యమిస్తూ.. ఇరాన్‌లో సైనిక కార్యకలాపాల కోసం రక్షణ శాఖ అంచనా వ్యయం 29 బిలియన్ డాలర్లకు పెరిగిందని తెలిపారు. సైనిక పరికరాల మరమ్మత్తు లేదా వాటి స్థానంలో కొత్త వాటిని భర్తీ చేయడానికి అయ్యే ఖర్చుల యొక్క ఖచ్చితమైన అంచనాల వల్లే ఈ వ్యయం భారీగా పెరిగింది.
Also Read:హైపర్ టెన్షన్..‘సైలెంట్ కిల్లర్’!

