పాక్‌ను చిత్తుచేసిన బంగ్లాదేశ్‌

3
- Advertisement -

సిల్హెట్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ను 78 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ వారి స్వదేశంలోనే మొదటిసారిగా 2-0తో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్‌ను నమోదు చేసింది. ఈ విజయంతో అప్‌డేట్ చేసిన డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్) పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఒక స్థానం పైకి ఎగబాకగా, భారత్ ఒక స్థానం దిగజారింది.

చివరిదైన రెండో టెస్టులో పాకిస్తాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లతో చెలరేగడంతో, షాన్ మసూద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు 358 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read:ఇంద్రరామ్.. ‘డోంట్ స్లీప్’

ఈ విజయంతో వరల్డ్ Test ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఒక స్థానం మెరుగుపరుచుకుంది. ఏకంగా భారత్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకున్నారు. మరోవైపు, పాకిస్తాన్ మరిన్ని పాయింట్లు కోల్పోయి ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది. రెండుసార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన భారత్ 9 మ్యాచ్‌లలో 4 విజయాలు, 4 ఓటములు, 1 డ్రాతో బంగ్లాదేశ్ కంటే కిందకు (ఆరో స్థానానికి) పడిపోయింది.

- Advertisement -