మోదీ దగ్గరకు చరణ్.. 23 నుంచి షూట్

31
- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నారు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన తర్వాత ముందుగా ఢిల్లీ చేరుకున్నారు రామ్ చరణ్. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం తర్వాత అమెరికా నుంచి తొలిసారిగా భారత్ వస్తున్న రామ్ చరణ్ కు.. ఢిల్లీలోని తెలుగు సంఘాలు ఘనస్వాగతం పలికాయి. ఆస్కార్ వేదిక నుంచి హస్తినకు చేరుకున్న ఆయన, ఓ ఇంగ్లీష్ ఛానెల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్‌ లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం రామ్ చరణ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో మీటింగ్ ఆనంతరం తిరిగి రాత్రి 9.31 గ.లకు చరణ్ బేగంపేట విమానాశ్రాయనికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌కు అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, చరణ్ ఒక్కరే నేరుగా ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి మోదీని కలవడం పై విమర్శలు వినిపిస్తున్నాయి.

మరి ఈ అంశం పై చరణ్ టీమ్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తోందో చూడాలి. ఇక ఈ నెల 23 నుంచి చరణ్ షూట్ లో జాయిన్ కానున్నాడు. విజువల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ – కియారా అద్వాణీ జంటగా వస్తోన్న RC15 మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను ఈ నెల 23 నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈసినిమాకు ‘CEO’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారట.. ఈ సినిమాలో చెర్రీ ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

ఈ వారం ఓటీటీ సినిమాలివే!

ఆస్కార్‌తో హైదరాబాద్‌లో ఆర్ఆర్ఆర్ టీం..

శబ్దం…కీలకపాత్రలో సిమ్రాన్

- Advertisement -