నాలుగో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుండే బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.
ఓటర్లు అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు,ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు, రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలని కోరుతున్నాను.
ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను .— Narendra Modi (@narendramodi) May 13, 2024