గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు..

414
MLC Shambipur Raju
- Advertisement -

సోమవారం ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు జన్మదినం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. గ్రీన్ ఛాలెంజ్ ద్వారా సినీ రాజకీయ ప్రముఖులు మొక్కలను నాటి తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

మొక్కలు నాటడం మరియు వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే అని ఎమ్మెల్సీ సూచించారు. అలాగే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -