మొక్కలు నాటిన నటి దీప్తి సునైనా..

67
Actress Deepthi Sunaina

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు నటి దీప్తి సునైనా. దేత్తడి హారిక, నోయేల్, భాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి దీప్తి జూబ్లీహిల్స్ లోని పార్క్‌లో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది.

అనంతరం దీప్తి మాట్లాడుతూ.. జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని ఈ సవాలును స్వీకరించి మొక్కలు నాటనని నటి దీప్తి సునైనా తెలిపింది. అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో నలుగురు ( షణ్ముక్ , సావిత్రి ( శివ జ్యోతి ) , రవిక్రిష్ణా , గీతా మాధురి )లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని నటి దీప్తి సునైనా తెలిపింది.