ప్రపంచంలోనే ప్రత్యేకం యాదాద్రి: కవిత

81
yadagirigutta
- Advertisement -

యాదాద్రి నృసింహుడి నిజరూప దర్శనం ఇవాళ నుం డి కలగనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వర్ణకాంతుల్లో వెలిగిపోతున్న ఆలయ ఫొటోలను ట్వీట్‌ చేశారు. అద్భుతమైన శిల్పకళతో రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్న కవిత… యాదాద్రి ఆలయానికి సంబంధించి ప్రతి ఒక్కటీ విశిష్టమైనదే. మన అందమైన రాష్ర్టానికి అత్యంత చారిత్రక, ఐకానిక్‌ దేవాలయాల్లో ఒకటిగా యాదాద్రిని అందించిన సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

ఇక ఇవాళ ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలవుతాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేపడుతారు. ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేస్తారు.

దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహిస్తారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రధానాలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచనారసింహుడికి ఆరాధనలు జరుపుతారు. అనంతరం స్వయంభువుల దర్శనాలకు అనుమతి ఇస్తారు.

- Advertisement -