మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని చెర్రీస్ ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో శనివారం క్రిస్మస్ వేడుకలు జరిగాయి. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి,పిర్జాదిగుడా మున్సిపాలిటీ కార్పొరేటర్లు,ఇతర టీఆర్‌ఎస్ నాయకులు హాజరైయ్యారు. చెర్రీస్ ఫౌండేషన్ లోని చిన్నారులు చేసిన నృత్యాలు,ఇతర కార్యక్రమాలను ఎమ్మెల్సీ కవిత ఆసక్తిగా తిలకించారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ వేడుకలు చెర్రీస్ ఫౌండేషన్‌లో జరుపుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంత మంది పిల్లలకు అండగా నిలుస్తున్న నిర్వాహకులను ప్రత్యేక అభినందనలు. నన్ను చాలా మంది క్రిస్మస్ పండుగ వేడుకలకు ఆహ్వానించారు. కానీ ఇక్కడికి రావడం ఆనందాన్నిచ్చిందని కవిత తెలిపారు. నేను మీకు మాటిస్తున్న ఈ 45 మంది పిల్లలను నా బిడ్డలు భావించి వారికి అన్ని విధాలుగా నా సహకారం అందిస్తాను. మీకు ల్యాండ్ సమస్య ఉందని చెప్పారు ఇక్కడి నాయకులతో చర్చించి..వచ్చే సంవత్సరం వరకు అందరం సొంత జాగలో వేడుకలు చేసుకునేలా కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం నేను నా జీవితంలో మరచిపోలేను. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ చెర్రీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. మీరంతా అనాధ పిల్లలు కాదు అణిముత్యాలు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మీకు కానుకలు ఇస్తాను. మా యూనివర్సిటీలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఉన్నత చదువులు,హాస్టల్ సౌకర్యం ఉచితంగా కల్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవ సోదరులకు ప్రత్యేక బహుమతులు ఇస్తున్నారు. దేశంలోనే క్రిస్టియన్స్‌కు అండగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు.