గవర్నర్ తమిళసైకి కవిత చురకలు..

26
- Advertisement -

గణతంత్ర దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళ సైకి చురకలు అంటించారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు కవిత. కొత్త భవనాలు అభివృద్ధి కాదంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని తమిళి సై ప్రశ్నించగా తాము సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అని క‌విత గుర్తు చేశారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాము అని తెలిపారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను, పాలనను మెరుగుపరిచేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో నిర్మించిన సెక్రటేరియట్ భవనాన్ని వ్యతిరేకిస్తున్నారా అని నిలదీశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -