- Advertisement -
గల్ఫ్ కార్మికుల పొట్టకొట్టేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. గల్ఫ్ కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వం కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకమని తాజా ఉత్తర్వులతో మరోసారి నిరూపితమైందన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది గల్ఫ్ కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. గల్ఫ్ కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం తీసుకున్న వేతన తగ్గింపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -