యాసల బాలయ్య మృతి..మంత్రి హరీష్‌ సంతాపం

37
ts

అంతర్జాతీయ బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప చిత్ర కారున్ని కోల్పోయిందన్నారు. బాలయ్య మరణం చిత్ర కళారంగానికి తీరని లోటని… ఆయన అందించిన సేవలు సిద్దిపేట గడ్డ మరవదన్నారు.

పల్లె జీవకళను ఉట్టి పడేలా ఎన్నో చిత్రాలను వేసి అంతర్జాతీయంగా తెలంగాణ పల్లె సంస్కృతికి వన్నె తెచ్చారని ఆయన సేవలను మంత్రి కొనియాడారు. సిద్దిపేట బిడ్డగా సిద్దిపేట కీర్తిని తన బాతిక్ చిత్రకళ ద్వారా ఖండతరాలు దాటించిన బాలయ్య….తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు హరీష్ రావు.