సింగరేణికి మరో వందేండ్ల భవిష్యత్‌:సీఎండీ శ్రీధర్

387
Singareni CMD N Sridhar
- Advertisement -

సమిష్టి కృషితో సింగరేణికి మరో వందేండ్ల సుస్థిర భవిష్యత్‌ ఉంటుందన్నారు సీఎండీ శ్రీధర్‌. సింగరేణి 131వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, కార్మికులకు సంస్థ సీఎండీ శ్రీధర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

సింగరేణిలో ప్రస్తుతం 45,131 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది 64 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సంస్థ రూ.27 వేల కోట్ల బొగ్గును విక్రయించింది. సంస్థ నిర్ధేశించుకున్న లక్ష్యాలు సాధిస్తున్న కార్మికులను అభినందించారు. దేశంలో బొగ్గుతోపాటు థర్మల్‌, సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ సింగరేణి మాత్రమేనని చెప్పారు.

హైదరాబాద్‌ దక్కన్‌ కంపెనీ 1889లో ఇల్లెందులో వద్ద తొలిసారిగా బొగ్గును ఉత్పత్తి చేసింది. అయితే 1920లో సింగరేణి కాలరీస్‌గా అవతరించింది. సింగరేణి కాలరీస్‌లో నిజాం షేర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1945లో తొలి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి కాలరీస్‌ ఆవిర్భవించింది.

- Advertisement -