బీజేపీ విధానాలతో భయపడుతున్న ప్రజలు: గుత్తా

17
gutha

బీజేపీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని చెబుతున్నారు…. బీజేపీ విధానాలతో కేసీఆర్ కాదు ప్రజలు భయపడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో ఎమ్మెల్సీ, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆరాచాక పాలన సాగించాలని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేలా సీబీఐ, ఐటీ దాడులతో ఒత్తిడికి గురి చేస్తున్నారు…ఇదే పద్దతిని తెలంగాణలో చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.ప్రజలు, నాయకులను జైల్లో పెట్టి ఏం సాధిస్తారు….బీజేపీ కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే దురుద్ధేశాలతో ద్వంద విధానాలతో వ్యవహరిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు, రైతులను ఇబ్బందులు పెట్టేలా బీజేపీ నేతల మాటలు ఉన్నాయన్నారు.