- Advertisement -
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్. వచ్చే వర్షాకాలం సీజనల్ వ్యాధులు నివారించేందుకు పలు సూచనలు చేశారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.వీటిని అరికట్టేందుకు ఫాగింగ్‌ను అలాగే స్పైయింగ్‌ను పెంచాలి అన్నారు.
అదే విధంగా కరోనా వ్యాధి ఉంది కనుక, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు, మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి నీటిని అందించాలి. మురికి కాలువలు శుభ్రం చేయాలి.కాలనీల్లో పిచ్చి మొక్కలు,గడ్డి,చెత్త లేకుండా చూడాలి. సులబ్ కాంప్లెక్స్ ద్వారా ప్రజలుకు మరుగు దొడ్లు అందుబాటులో తీసుకువస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మునిసిపల్ చైర్మన్ గుర్రం నీరజ-భూమురెడ్డి, మునిసిపల్ కమిషనర్ స్వాతి, పలువురు పాల్గొన్నారు.
- Advertisement -