పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

345
Mla sunke ravi
- Advertisement -

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం మంగళ్ళపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ శశాంక పర్యటించారు.ఇందులో భాగంగా మక్కల కొనుగోలు కేంద్రని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.

ఇళ్ల మధ్య ఉన్న గడ్డిని తొలగించాలన్నారు. నీరు నిలువకుండా చూడాలని అన్నారు. నీరు నిలిస్తే దోమలకు స్థావరంలా ఏర్పడి దోమలు పెరిగే అవకాశం ఉంటుందని వాటి ద్వారా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుందని అన్నారు. కాబట్టి ప్రజలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు.

- Advertisement -