రైతుల మేలుకోసమే నూతన వ్యవసాయ విధానం..

257
Minister Niranjan Reddy
- Advertisement -

హైదరాబాద్: సమగ్ర వ్యవసాయ విధానం అమలుపై మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్ కేశవులు, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతుల మేలుకోసమే నూతన వ్యవసాయ విధానమని మంత్రి తెలిపారు.వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష. దశాబ్దాలుగా దగాపడ్డ రైతులు తెలంగాణ రాష్ట్రంలో ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. వారు ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి చేరాలి అన్నారు.

పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి.. ప్రతిపాదనలను సిద్దం చేయండి అని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సోన మూలంగా మధుమేహులకు కలిగే ఉపయోగాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించేలా ప్రచారం జరగాలి. వానాకాలంలో వేసే ప్రతి పంటా రికార్డ్ కావాలని మంత్రి తెలిపారు. నేలల వర్గీకరణ చేయాలి.. ఆయా నేలలలో పండే అనుకూలమైన పంటలను గుర్తించాలి. పెరిగిన భూగర్భ జలాలకు అనుకూలంగా వేసే పంటల విస్తీర్ణంపై ఖచ్చితమైన అంచనాలు సిద్దంచేయాలి అధికారులకు సూచించారు మంత్రి.

ప్రజలకు కూరగాయల కొరత లేకుండా ప్రణాళిక సిద్దం చేయాలి. ఇక్కడ పండుతున్నవి, దిగుమతి చేసుకుంటున్న వివరాల ప్రకారం అంచానాలు సిద్దంచేయాలి.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ముఖ్య గణాంకాల అధికారిగా (పంటల నమోదు) నియమిస్తూ ఉత్తర్వులు జారి చేయాలి.

- Advertisement -