మత్య్సకారుల అభివృద్దే సీఎం కేసీఆర్ ధ్యేయం..

152
ramulu naik
- Advertisement -

రాష్ట్రంలో మత్స్య సంపద పెంపుదల,మత్స్యకారుల ఆర్ధికాభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు ఎమ్మెల్యే రాములు నాయక్‌. ఖమ్మం వైరా రిజర్వాయర్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు రాములు నాయక్‌.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సుమారు రూ.22 లక్షల విలువైన చేప పిల్లలను వైరా రిజర్వాయర్‌కు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందన్నారు. మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ పథకం దేశానికే ఆదర్శమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు, ఏడీ సతీశ్‌, ఎఫ్‌డీవో శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -