వారంలో భారీగా పడిపోయిన బంగారం ధర..

189
gold price

బంగారం ధర భారీగా పడిపోయింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పడిపోవడంతో మన దేశంలోనూ బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈవారం బంగారం ధర భారీగా దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,450 తగ్గి రూ.52,370కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,200 తగ్గి రూ.48,050కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పతనమైంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.7,700 తగ్గి రూ.59,300కు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.68 శాతం తగ్గి 1864 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.95 శాతం తగ్గుదలతో 22.97 డాలర్లకు దిగొచ్చింది.