సన్ రైజర్స్‌పై కోల్ కతా ఘనవిజయం..

162
kkr
- Advertisement -

ఐపీఎల్ 13లో భాగంగా బోణి కొట్టింది కోల్ కతా నైట్ రైడర్స్‌. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సన్ రైజర్స్ విధించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కొల్పోయి 145 పరుగులు చేసింది.

స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన కోల్ కతాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ నరైన్,తర్వాత దినేశ్‌ కార్తీక్‌ డకౌట్‌గా వెనుదిరిగారు. నితిశ్ రాణా ఉన్నంతసేపు దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు కొల్పోవడంతో మరో వికెట్ కొల్పోకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు గిల్,మోర్గాన్‌.మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ శుబ్‌మన్‌ గిల్‌ (62 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్‌ (29 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 70 బంతుల్లో 92 పరుగులు జోడించారు.

అంతకముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (38 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ నమోదు చేయగా, డేవిడ్‌ వార్నర్‌ (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (31 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు.

- Advertisement -