TN:స్పీకర్‌గా ఎమ్మెల్యే ప్రభాకర్

2
- Advertisement -

టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభాకర్ తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నియామకానికి సభలోని మెజారిటీ సభ్యులు మద్దతు పలికారు. ప్రభాకర్‌తో పాటు టీవీకేకే చెందిన మరో కీలక నేత రవిశంకర్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

ఎన్నిక అనంతరం ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నాయకులు మరియు ఇతర సభ్యులు నూతన స్పీకర్ ప్రభాకర్‌ను సగౌరవంగా స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఒక కొత్త ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో అత్యున్నత స్థానాలను కైవసం చేసుకోవడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

సభను నిష్పక్షపాతంగా, నిబంధనలకు అనుగుణంగా నడిపిస్తారని ఆశిస్తూ ముఖ్యమంత్రి విజయ్ నూతన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. అసెంబ్లీ కార్యకలాపాలు ప్రజాస్వామ్య బద్ధంగా సాగడానికి వీరు ఇద్దరూ తమ అనుభవాన్ని ఉపయోగిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:‘గాంధీ బజార్’లో బాబిల్ ఖాన్

- Advertisement -