చెక్ డ్యామ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి..

381
mla marri janardhan reddy
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలం ఆకునెల్లికుదురు గ్రామ సమీపంలో దుందుభి నదిలో 5 కోట్ల వ్యయంలో నూతనంగా నిర్మించబోయే చెక్ డ్యామ్‌కు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.అనంతరం చెక్ డ్యామ్ డిజైన్ మరియు డ్యామ్ నిర్మించే సైట్‌ను పరిశీలించారు.

ఈ సందర్బంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో 33 కిలోమీటర్లు విస్తరించి ఉన్న దుందుభి నదిపై 10 చెక్ డ్యామ్‌లు మంజూరు కాగా, మొదటగా ఆకునెల్లికుదురు వద్ద శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. సిఎం కెసిఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతుల సమస్యలపై అవగాహన ఉన్నందున రాష్ట్రంలో ఉప నదులపై చెక్ డ్యామ్ నిర్మించి రైతులకు సాగు నీరు అందజేయాలనే సంకల్పంతో పెద్దఎత్తున చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారన్నారు.

mla marri janardhan reddy

వర్షాలు పడకున్న కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా వాగులోకి నీటిని వదిలి రైతులకు సాగునీరు అందజేస్తామన్నారు.చెక్ డ్యామ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి,మార్కెట్ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -