మరోసారి వార్తల్లో సోనూసూద్..!

112
sonusood

కరోనా వైరస్ నేపథ్యంలో వలస కార్మికులకు అండగా నిలిచి సినీ నటుడు సోనూ సూద్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తన స్వంత ఖర్చులతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు బస్సులు ఏర్పాటుచేసి రీల్ లైఫ్‌లో విలన్‌ అయినా రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా మారారు.

సోనూ చేసిన సాయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సైతం అభినందనలు తెలియజేసింది. తాజాగా 2 రూపాయలకే ఫేస్ మాస్కు ఎలా తయారు చేసుకోవాలో సోషల్ మీడియా వేదికగా సూచించారు సోనూ.

2 రూపాయల ప్లాస్టిక్‌ ఫైల్‌ తీసుకొని దాన్ని రెండింటిగా కట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత స్టాప్టెర్‌ తీసుకొని ఒక కవర్‌కి అటు చివర ఒక రంధ్రం, ఇటువైపు మరొక రంధ్రం వేయాలి. ఇప్పుడు సన్‌గ్లాస్‌ తీసుకొని రెండు రంధ్రాల్లో సెట్‌చేసి కళ్లకు పెట్టుకుంటే సరి. ముఖమంతా కవర్‌ అయ్యేలా మాస్క్‌ రెడీ అంటూ వీడియోషేర్ చేయగా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.