హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిన ఘనత కేటీఆర్‌ది- ఎమ్మెల్యే

200
mla Maganti Gopinath
- Advertisement -

టీఆర్‌ఎస్ అభివృద్ధి చేస్తుంది కాబట్టే ఇతర పార్టీ నేతలందరూ టీఆర్‌ఎస్ పార్టీలో కలుస్తున్నారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈ రోజు బీజేపీ సీనియర్ నాయ‌కుడు రావుల శ్రీధ‌ర్ రెడ్డి సోమవారం టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, వి. శ్రీనివాస్ గౌడ్‌, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్, భానుప్రసాద్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మరియు ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో రూపురేఖలే మార్చిన ఘనత కేటీఆర్ కి దక్కుతుంది అన్నారు. శ్రీధర్ రెడ్డి నేను ఒక కుటుంబ సభ్యులగా పనిచేస్తాం. బీజేపీ నుంచి వచ్చిన నేతలందరూ కలిసి మెలిసి పనిచేసుకుందామన్నారు. గతంలో ఉన్న కేసులన్ని పరిష్కరించుకుందాం.. ఇప్పటికే ఉన్న కేసులన్ని విత్ డ్రా చేసుకుంటామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు.

- Advertisement -