గవర్నర్ చర్య ప్రజాస్వామ్య విరుద్దం!

28
jeevan reddy
- Advertisement -

రాజ్‌భవన్‌లో ప్రజాదర్భార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన…గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని విమర్శించారు. అది ప్రజాదర్బార్‌ కాదని, పొలిటకల్‌ దర్బార్ అని విమర్శించారు.

గవర్నర్‌ వ్యవస్థపై ప్రధాని మోదీ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శలు గుప్పించారు. మోడీ సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్‌లుగా రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తులను నియమించాలని తెలిపి ప్రధాని కాగానే మాట మార్చారని గుర్తుచేశారు.

బీజేపీ నేతలు ఏమైనా సత్యహరిశ్చంద్రులా.. ఎందుకు వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగడం లేదన్నారు. అదే విశయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారని చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ.. ప్రధాని అయ్యారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంటని ప్రశ్నించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బీజేపీ కుట్రలకు తగిన సమాధానం చెబుతారని దుయ్యబట్టారు.

- Advertisement -