కాంగ్రెస్ నేత, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు..నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భార్య పార్వతమ్మ. తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం దుష్ప్రచారం మాత్రమే….కావాలని మా పై బురద జల్లుతున్నారని స్పష్టం చేశారు.
మా కుటుంబం మొత్తం సీఎం కేసిఆర్ అడుగుజాడలోనే నడుస్తామని..టీఆరెస్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. ఈ రోజు మా ఊళ్ళో మా ఇంటి ముందు నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళుతుంటే పెద్ద వారు గనుక నమస్కారం చేసి గ్రామస్తుడు తెలిసిన వ్యక్తి గనుక ఆయనతో మాట్లాడాను. ఆ సమయంలో లో కొంతమంది ఫోటోలు తీసి నేను కోమటిరెడ్డికి ప్రచారం చేస్తున్నాను మద్దతు ఇస్తున్నాను అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
నా భర్త అడుగు జాడల్లో నడుస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ గెలుపుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకుండా టిఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు.