బీజేపీ బండి సంజయ్ చేసిన ఆరోపణలు సత్యదూరం, అవాస్తవాలేనని స్పష్టం చేశారు ఎమ్మెల్యే బాల్క సుమన్. టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో కలిసి మాట్లాడిన సుమన్…….బీజేపీ కి బండి సంజయ్ గుదిబండ అని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు..పాద యాత్ర కు స్పందన లేకే బండి బెకార్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బురదలో పొర్లే పందికి పన్నీరు వాసన ఎలా తెలుస్తుంది ? …బడా జూటా బండి సంజయ్ కు ప్రగతి భవన్ పనితనం ఎలా తెలుస్తుంది ? అని ప్రశ్నించారు. ఉద్యమానికి తెలంగాణ భవన్ ఊపిరి లూదితే ..ప్రగతి భవన్ తెలంగాణ బతుకు గతి ని మార్చిందన్నారు. అన్ని గొప్ప సాగునీటి ప్రాజెక్టులకు పురుడు పోసింది ప్రగతి భవన్ …ప్రగతి భవన్ ఓ భవనం కాదు తెలంగాణ సకల జనుల సంక్షేమ భవన్ …కెసిఆర్ కు నాలుగు కోట్ల ప్రజల అభిమానమే ఆస్తి ..వేరే ఆస్తులు లేవన్నారు.
తెలంగాణ ప్రజలను బికారి లు గా మార్చారు అన్న వ్యాఖ్యలు బండి సంజయ్ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వినాయక నిమజ్జనం ముగిసింది ..ఇక ప్రతిపక్షాల నిమజ్జనమే మిగిలి ఉందన్నారు. కేంద్రం తెలంగాణ ను పార్లమెంటు లో ప్రతీ సందర్భంలో కొనియాడుతోంది…పార్టీల ప్రలోభాల గురించి బండి సంజయ్ మాట్లాడటమా ?…ప్రభుత్వాలను రాత్రికి రాత్రే తారు మారు చేసిన ఘనత బీజేపీ ది కాదా ?..కడిగిన ముత్యానికి కూడా మారకాలుంటాయేమో కానీ మా పాలన కు మరక లేదన్నారు.
100 కు పైగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన ఘనత మోడీ ది …అన్నిటిని అమ్మేసి తెలంగాణ కు శఠగోపం పెట్టిన కేంద్రాన్ని ప్రశ్నించని సన్నాసులు నలుగురు బీజేపీ ఎంపీ లు
…రాత్రి వంద పురుగులు తిని ఉదయం దేవుడి ఫొటో వెనక దాక్కున్న బల్లి లా ఉంది బీజేపీ తీరు అన్నారు. అరెక్ మాల్ ఫర్ సేల్ నినాధంలో బీజేపీ దూసుకుపోతోంది…మోడీ పాలనలో 8లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చెయ్యలేదని ప్రశ్నించారు.
మోడీ క్రేజ్ 42శాతం దేశంలో పడిపోయింది. … ఒడ్లు కొననంటున్న విషయంపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అంటే నమ్మకం- బీజేపీ అంటే అమ్మకం….హుజురాబాద్‌లో గెలిచేది టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.