- Advertisement -
ఈ నెల 29న వరంగల్ వేదికగా నిర్వహించనున్న రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న తెరాస విజయ గర్జన సభను అందరి సహకారంతో విజయవంతం చేద్దామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. దేవన్నపేట రైతులు మరియు స్థానిక భూ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ఏ ఇబ్బంది లేకుండా తానే దగ్గరుండి చూసుకుంటానని ఎమ్మెల్యే అరూరి రమేష్ హామీ ఇచ్చారు. విజయ గర్జన సభను విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -