గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ..

372
MLA Arekapudi Gandhi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ శేరీలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరిరారు. దానిని స్వీకరించిన అరెకపూడి గాంధీ తన నివాసం దగ్గర వివేకానంద కాలనిలో అభిమానుల మధ్య మొక్కలు నాటారు.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తనన ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని, ప్రతి రోజు మొక్కలు నాటే కార్యక్రమం తన దినచర్యలో భాగస్వామ్యం అయిందని, నాటిన మొక్కలు ఎదిగే వరకు బాధ్యత తీసుకుంటున్నాని తెలిపారు. ఈ ఛాలెంజ్ తన నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ, తనవంతుగా మొక్కలు నాటుతున్నాని ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ కుమార్ కి కృతఙతలు తెలియజేశారు.

- Advertisement -